కలియుగము
కలి యుగము (कली युग) హిందూ పురాణాలననుసరించి మహాయుగములోని చివరి మరియు నాలుగవ యుగము. ఇది ప్రస్తుతము నడుస్తున్న యుగము. వేదాల ననుసరించి యుగాలు నాలుగు-
సత్యయుగము
త్రేతాయుగము
ద్వాపరయుగము
కలియుగము
కలి యుగము యొక్క కాల పరిమాణము 4,32,000 సంవత్సరములు, అందు సుమారుగా ఐదు వేల సంవత్సరములు గడిచిపోయినాయి. హిందూ మరియు బౌద్ధ కాలమానములకు ఆధార గ్రంధమైన సూర్య సిద్ధాంత ప్రకారము క్రీ.పూ 3102 ఫిబ్రవరి 18 అర్ధరాత్రి (00:00) కలియుగము ప్రారంభమైనది. కృష్ణుడు సరిగ్గా అదే సమయానికి అవతారమును చాలించాడని హిందువులు భావిస్తారు. కలియుగాంతము నందు కల్కి రూపమున భగవంతుడు అవతరించి తిరిగి సత్య యుగ స్థాపనకు మార్గము సుగమము చేస్తారు .
కలియుగ లక్షణాలు:
కలియుగంలో అంతా అధర్మమే. అంతా అన్యాయమే. మంచి వాళ్ళకు చెడు ఎదురవుతూ ఉంటుంది. అసలు భగవంతుడిని తలచుకొనే వారే కనిపించరు. సంసారంలో భార్యాపుత్రులు, ధనధాన్యాలు లాంటి వన్నీ సులభంగా సమకూరతాయి.
Part 2
కలియుగము - సాధన pravachanam on 20,21,22 September 2013 at Kuchalambal Kalyana Mahal, Chetpet, Chennai, Tamil Nadu 600031.
Part 3
ఋతువులు: రెండు నెలలకు ఒక ఋతువుగా వాటి దినములలో కాల ధర్మములను బట్టి ఋతువు అని పిలుచు చున్నాము . సంవత్సరములోని 12 నెలలు 6 ఋతువులుగా నిర్ణయించబడినవి .
భూమి తన చుట్టూ తాను తిరుగుతూ , సూర్యుని చుట్టూ తిరిగే సంవత్సర కాలములో సగ కాలము సూర్యునికి దగ్గరగాను, మిగతా సగ కాలం దక్షినమునకు, దక్షిణము నుండి ఉత్తరమునకు ప్రయాణము చేయుచున్నట్లు కనపడును. సూర్యుడు ఉత్తరము దిక్కుగా ప్రయాణము చేయుచున్నట్లు కనపడు కాలమునకు ఉత్తరాయనము , దక్షిణపు దిక్కుగా ప్రయాణము చేయు కాలమును దక్షిణాయనము అందురు.
శకములు: సంవత్సర లెక్కల కోసం ఈ శకములు ప్రారంభ మైనవి.పూర్వం నుండి మన దేశంలో అనేక శకములు వాడుకలో ఉండెను . వాటిలో ముఖ్యమైనవి 1 .శాలివాహన శకము 2 . విక్రమార్క శకము . శాలివాహన శకము దక్షిణ దేశంలోనూ, విక్రమార్క శకము ఉత్తర దేశంలోనూ వాడుకలో ఉన్నవి. మనకు స్వాతంత్ర్యము వచ్చిన తరువాత మన భారత ప్రభుత్వము ఇటువంటి వేరు వేరు శకములుండ రాదని, దేశమునకు మొత్తము ఒకే జాతీయ శకము ఉండవలెనని, శాలివాహన శకమును జాతీయ శకముగా నిర్ణయించారు .
యుగములు: యుగములు నాలుగు . 1 . కృత యుగము 2 . త్రేతా యుగము 3 . ద్వాపరయుగము 4 . కలియుగము .
కృతయుగము -- 17,28,000 సంవత్సరములు
త్రేతాయుగము - 12,96,000 సంవత్సరములు
ద్వాపరయుగము - 8,64,000 సంవత్సరములు
కలియుగము -- 4,32,000 సంవత్సరములు
నాలుగు యుగములకు కలిపి మొత్తము 43,20,000 సంవత్సరములు అగును . దీనినే ఒక మహా యుగము అందురు.

No comments:
Post a Comment